అందరి మగవాళ్ళకి కావాల్సింది ఒక్కటే', అనే ఆలోచన రోజురోజుకి మర్రి చెట్టు వేర్లలా పాతుకుపోతుంది.
ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో తను ఏకవస్త్ర. పైగా రజస్వల. ఏమీ చెయ్యలేని భర్తలతో ఏమైనా చెయ్యగలిగే కౌరవుల మధ్యలో వున్నప్పుడు మగజాతి అంటేనే అసహ్యం కలిగే క్షణంలో ఆమెకు కృష్ణుడు గుర్తుకువచ్చాడు. తరువాతది చరిత్ర.
అశోకవనంలో చీరెతో చెట్టుకి ఉరి వేసుకుందామని ఆత్మహత్యకు పాలుపడ్డ సీతకి హనుమంతుడు కనపడ్డాడు. తరువాతది చరిత్ర.
ఆడదాని కన్నీరు తుడిచే వాడే మగాడు. వాడు పుట్టిందే అందుకు. ఆడది అనుకుంటున్నట్టు ప్రతీ మగాడు రావణాసురుడు కాదు. మగాడు అనుకుంటున్నట్టు ప్రతీ స్త్రీ శూర్పనక కాదు.
ఒకరు అవమానించారని, ఇంకొకరు మోసం చేశారని మొత్తం జాతిని ఒకేలా చూడడం రంగు బాలేదని గొడుగుని వర్షంలో తీసుకెళ్ళకపోవడం లాంటిది. ఉన్నవే రెండు జాతులు. మిడిమిడి జ్ఞానం తో ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటే మిగిలేది మనుషులు కాదు. బట్టలేసుకునే జంతువులు!

లక్ష కురుక్షేత్ర యుద్ధాలనైనా భరించొచ్చు కానీ ప్రేమించిన వాళ్ళ మౌనం మాత్రం తట్టుకోలేము...!